శనివారం మధ్యాహ్నం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూం గృహాల ప్రారంభోత్సవం సెప్టెంబర్ మొదటి వారంలోనే ఉండటంతో, పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్‌రూం గృహాల్లో తాగునీటి సరఫర, డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు.