అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని చాకలి వీధికి చెందిన చాకలి వన్నూరు స్వామి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.