తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. నిరుపేదల ఆరోగ్య సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి సరఫరా చేసిన మందులను అక్కడి వైద్య సిబ్బంది చెత్తకుప్పకు తరలించారు. స్థానికులు గమనించి ట్రాక్టర్ ను అడ్డుకోవడంతో అసలు విషయం బయటపడింది. కాలం చెల్లిన మందులు కావడంతో అర్ధరాత్రి సమయంలో సిబ్బంది పొలాల్లోకి తరలించారు. అయితే ఈ వీడియో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిపై పై సంబంధిత అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..