ఉమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు పీహెచ్సీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లిలో జ్వరాల కేసులు పెరగడంతో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏహెచ్ ఇఓ అస్లాం అహ్మద్ మాట్లాడుతూ.. ఏడుగురికి జ్వరాలు గుర్తించి చికిత్స అందించామని తెలిపారు. రెండు రోజులుగా శిబిరం కొనసాగుతోందని, గ్రామంలోని జంగాల కాలనీలో గృహాలను సందర్శించి ఆరోగ్య అవగాహన కల్పించామని చెప్పారు. ప్రజలు కాచిన నీరు మాత్రమే తాగాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు