జన్నారం మండలంలోని బాదంపల్లి,ధర్మారం మధ్యలో బైక్ కాలువలో పడి పూడూరి నరేష్ అనే యువకుడు మృతి చెందాడని జన్నారం ఎస్సై అనూష శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారి వివారాల ప్రకారం బీర్పూర్ గ్రామానికి ల్ చెందిన పుడూరి నరేష్, విష్ణువర్ధన్ జన్నారం మండలం బాదంపల్లిలోని తన అక్క ఇంటికి వచ్చి రాత్రి తిరిగి వెళుతున్న క్రమంలో బైక్ అదుపుతప్పి కాల్వలో పడడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మరొకరు విష్ణువర్ధన్ కు గాయాలు కావడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు. నరేష్ తండ్రి మిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.