విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముందుగా చౌరస్తా నుండి ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకొని కలెక్టరేట్ ఎదుట బయట నుంచి ధర్నా చేపట్టారు.అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా SFI నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 6 సం"ల నుండి పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల పైగా స్కాలర్ షిప్స్ & ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని,స్కాలర్ షిప్స్ విడుదలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించాలని,నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.