అనంతపురం నగరంలోని సప్తగిరి చౌక్ లో బుధవారం ఉదయం నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో అనంతపురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు. జిల్లాలోనే ప్రత్యేకమైన సప్తగిరి చౌక్ వినాయకుడి ఉత్సవ వేడుకలను వారు ప్రారంభించారు.