Araku Valley, Alluri Sitharama Raju | Aug 26, 2025
అల్లూరి ఏజెన్సీ లో కురుస్తున్న భారీ వర్షాలకు ముందు జాగ్రత్త చర్యగా రెండు రోజులపాటు చాపరాయి జలపాతం, సరియా జలపాతలకు సందర్శనను నిలిపివేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. అరకులోయ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ రెండు జలపాతాల పరిధిలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో భారీ వర్షాలకు జలపాతాల వద్ద వరద నీరు ఉదృతంగా ఉండడంతో ఈ రెండు జలపాతాల వద్దకు పర్యాటకులకు అనుమతి లేదని ప్రకటించిన అధికారులు.