ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని పొలేరుల దుకాణాలను ఎస్ఐ మహేష్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పలు ఎరువుల దుకాణాల ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగిందన్నారు. దుకాణాలలో యూరియా నిలువలపై ఆరా తీసినట్లు తెలిపారు. ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించినట్టు ఎస్సై తెలిపారు.