ఉస్మానియా యూనివర్సిటీలోని పోలీస్ స్టేషన్ లో గ్రూప్ 1 పోస్టులపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై శనివారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. అనంతరం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ నాలుక కోస్తామని హెచ్చరించారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే అమ్ముకున్నారని నిరూపించే ఆధారాలు ఉంటే బయటపెట్టాలని అన్నారు. ఇస్తాను సారంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వ్యాఖ్యలపై కేటీఆర్ ను అరెస్టు చేయాలని అన్నారు.