ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్న ఉపాధ్యాయులు అందరికీ సెల్యూట్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.అనంతపురం నగరంలో ఉన్న ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాల్ లో శుక్రవారం ఉదయం 11 గంటల ఉపాధ్యాయ దినోత్సవం - 2025 సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వేంకటేశ్వర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించగా కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించరు.