పీలేరు గ్రామపంచాయతీ ప్రయోజనాల కొరకు 7లక్షలు విలువ చేసే స్థలం ను పీలేరు మండలం పీలేరు పట్టణానికి చెందిన టీడీపీ ప్రముఖ నాయకులు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కోటపల్లి బాబు రెడ్డి దృష్టికి పీలేరు పట్టణ పరిధిలోని సైనిక్ నగర్‌లో గత కొన్ని ఏళ్లుగా ఎదుర్కొంటున్న మురికి నీటి పారుదల సమస్యను ఆ ప్రాంత ప్రజలు తీసుకెళ్లారు. స్పందించిన బాబు రెడ్డి రూ.7 లక్షల విలువ చేసే ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి, పీలేరు గ్రామపంచాయతీ పేరిట రిజిస్టర్ చేయించి అధికారికంగా ప్రజల అవసరాల కోసం ఉపయోగించే విధంగా జిల్లా పంచాయతీ అధికారి సమక్షంలో పీలేరు అభివృద్ధి అధికారి లతీఫ్ ఖాన్ కు పత్రాలను సమర్పించారు