..కాకినాడ నగరంలో స్థానిక పెద్ద మార్కెట్,ఉల్లింకల వారి వీధిలో శ్రీవరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో 18 అడుగుల వేరుశనక్కాయల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వేరుశనక్కాయల వినాయకుడి నిర్వాహకుడు టేకుమూడి పెద్దబాబు మాట్లాడుతూ సుమారు 350 కేజీలతో 18 అడుగుల వేరుశెనక్కాయల వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ ఏడాది వినాయక చవితి తొమ్మిది రోజులు మాత్రమే ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.ప్రతి ఏడాది 18 అడుగులు వినాయకున్ని వివిధ రూపాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.సుమారు 17 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో వి