కాకినాడ జిల్లా గొల్లప్రోలు నుంచి బి. ప్రత్తిపాడు వెళ్లే రహదారిలో లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు పాడా కార్యాలయంలో సోమవారం అర్జీ సమర్పించారు. దీనిపై స్పందించిన పాడా పీడీ చైత్ర వర్షిని, గొల్లప్రోలు-బి. ప్రత్తిపాడు జంక్షన్ను మంగళవారం పోలీస్ అధికారులతో పరిశీలించారు. తక్షణమే లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో పోలీసు పెట్రోలింగ్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. పాడా కార్యాలయం నుండి సాయంకాలం 6 గంటలకు ప్రకటనలో తెలిపారు.