కౌటాల మండలం తలోడి గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు పేకాట ఆడుతూ పట్టుబడగా వారి వద్ద నుండి పదివేల 980 నగదు మరియు 52 ప్లేయింగ్ కార్డులను స్వాధీన పరచుకొని ఐదుగురిపై కౌటాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,