జగిత్యాల జిల్లా ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా ప్రజలను కలెక్టర్ సత్య ప్రసాద్ కోరారు.శుక్రవారం ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ లో జరుగుతున్న వైద్య పరీక్షల వివరాలను, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించారని పేర్కొంది.