వర్ని మండల కేంద్రం నుండి తగిలేపల్లి గ్రామానికి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. వర్ని నుండి తగిలేపల్లి వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. ధ్వంసమైన రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టి శాశ్వత రోడ్డు పనులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చించోళ్ళ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ హరినాయక్, గంగప్ప ,చింతం రమేష్, అశోక్, శ్రీకాంత్, శంకర్, సురేష్, అరుణ్, హుస్సేన్, మహేష్ పాల్గొన్నారు.