తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గా ఏజీ బాలచంద్ర కిషోర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ మంత్రి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ శ్రీ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో కృషి చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సమిష్టిగా పనిచేసే బిజెపి జనసేన పార్టీలకు కూడా తగిన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ బాలచంద్రాకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.