మహబూబాబాద్ పట్టణంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు, రైతులకు సరిపడా యూరియా పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల డిమాండ్తో కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన తెలిపారు. జిల్లాలోని పలు సమస్యల పరిష్కారాన్ని కూడా వారు డిమాండ్ చేశారు