సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో ఆదివారం నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఏఎస్పీ రాజేష్ మీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో డీజేలు ఏర్పాటు చేయకుండా గణేష్ నిమజ్జన శోభాయాత్ర చేపట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఇందులో రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.