ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. సోమవారం నారాయణఖేడ్ మండలంలోని బండ్రాన్ పల్లి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు. గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. అర్హులకు రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని వివరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.