నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం లలితోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక భాగ్యనగర్ కాలనీలో శ్రీ రాధాకృష్ణ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని విగ్రహం వద్ద యాదాద్రి సెట్టింగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. సుమారు 20 లక్షలతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మండపంతో పాటు దశావతారాలను ఏర్పాటు చేయడంతో బొజ్జ గణపయ్యతో పాటు భారీ సెట్టింగ్ చూసేందుకు పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు రుద్రాక్షతోపాటు ప్రసాదాన్ని అందిస్తున్నారు.