శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దారి దోపిడీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టీలు వ్యాపారిని బెదిరించి 40 లక్షలను దుండగులు లాక్కొని పారిపోతుండగా అదుపుతప్పి కారు బోల్తా పడింది. దుండగులు డబ్బులున్న బ్యాగులతో పారిపోయారు. కారులో 15 లక్షల రూపాయలను వదిలేసి వెళ్లారు. ఘటన స్థలానికి శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం కాలుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.