చేవెళ్ల మండలం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని పుష్కరిణిలో వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. కాగా సోమవారం మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో వ్యక్తి మృతదేహం లభ్యమయింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన తాపీ మేస్త్రి రవి వయసు 38 మద్యం సేవించి పుష్కరిణిలో ఈత కోసం దిగాడు కాగా ఊపిరాడక నీటిలో మునిగిపోయాడు. పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించిన మృతదేహం లభించలేదు. కాగా కొన్ని గంటల తర్వాత మృతదేహం నీటిపై తగిలింది.