ప్లాస్టిక్ రహిత పుట్టపర్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ క్రాంతికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పుట్టపర్తిలో రెస్టారెంట్లు, బేకరీ, హోటళ్లు, కిరాణా దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుకాణదారులకు జరిమానా విధించారు. హోటల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రమైన వస్తువులు వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగించడం మానవాళికి హానికరమన్నారు.