భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ కు విద్యార్థుల సమస్యలతో కూడిన వినతి పత్రం అందించినట్లు బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం సంఘం నాయకుడు కొల్లోజు దిలీప్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో ప్రహరీ గోడ లేకపోవడంతో పాములు, తేళ్లు వస్తు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జంగేడు కస్తూరిబా గాంధీ,ఎస్సీ హాస్టల్, మోడల్ స్కూల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు.