దత్తి రాజేరు మండలం మరడాం బస్ స్టాప్ వద్ద సోమవారం రాత్రి రోడ్డు క్రాస్ చేస్తున్న మరీ వలస గ్రామానికి చెందిన కోరడ లక్ష్మణరావును రామభద్రపురం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.