యాడికి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అగ్రికల్చర్ కిసాన్ డ్రోన్ ను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించారు.మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అగ్రికల్చర్ కిసాన్ డ్రోన్ అధికారులతో కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అన్నదాతల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువస్తుందని కొనియాడారు. అందులో భాగంగానే కిసాన్ డ్రోన్ లను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ డ్రోన్ తో ఈజీగా పంటలకు పురుగుల నివారణ మందులను పిచికారి చేయవచ్చని చెప్పారు. ఈ డ్రోన్ మండలంలోని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.