జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు పరీక్షల నిర్వహణపై శనివారం కాకినాడ కలెక్టరేట్ లో డీఆర్వో వెంకటరావు.. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, ప్రజారవాణా, ట్రెజరీ, విద్యుత్తు తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.