చంద్రగ్రహణం ముగిసిన తర్వాత సోమవారం గుత్తి, గుత్తి మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దేవాలయాలు తలుపులు తెరుచుకున్నాయి. గుత్తిలోని నగరేశ్వరాలయం, శివాలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, ఆర్ఎస్ లోని గౌతమేశ్వరాలయం, అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు అర్చనలు వంటి పూజలు చేశారు.