రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ను పాడేరు లో మర్యాద పూర్వకంగా కలిశారు. 2022 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన స్మరణ్ రాజ్ తెలంగాణ రాష్ట్రంలోని విద్యానగర్ కు చెందినవారు. నూజివీడు సబ్ కలెక్టర్గా పనిచేస్తు రంపచోడవరం ప్రాజెక్టు అధికారిగా పదోన్నతి పొందియున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి కాఫీ హౌస్ లో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనలు ఆదేశాలు అమలు చేసి గిరిజన అభివృద్ధికి చేస్తామన్నారు