అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నిమ్మలపాలెం రేవల్ల వెళ్లే రహదారిలో ఆదివారం రాత్రి కొయ్యూరు మఖం తాటి చెట్టు వద్ద టాక్టర్ ప్రమాదంలో చుండ్రు సింహాచలం అనే యువకుడు మృతి చెందాడు, స్థానికులు సోమవారం ఉదయం 11గంటల సమయంలో ఇచ్చిన వివరాలు ప్రకారం నిన్న రాత్రి ట్రాక్టర్ ప్రమాదంలో విషయం బయటకు పొక్కకుండ మృతి చెందని వ్యక్తి చుండ్రు సింహాచలాన్ని తన కుటుంబ సభ్యులకు తన స్వగృహానికి పంపించి వేశారనీ, ప్రమాదం జరిగిన ట్రాక్టర్ స్పాట్లో లేకుండా తీసుకెళ్లిపోయారనీ విషయం తెలుసుకున్న కొయ్యూరు పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు,