కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో స్వస్థ నారీ సశక్తి అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గంలో బుధవారం ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సురేంద్రబాబు స్వస్థ్ నారీ స శక్తి అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు వైద్య పరీక్షల తో పాటు ఉచితంగా మందులు అందజేస్తారన్నారు.