శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షిలో 544E జాతీయ రహదారి వద్ద కొండూరు వైపు నుండి లేపాక్షి కి నడుచుకొని వస్తున్న నారాయణప్ప వయసు 70 సం కుర్లపల్లి గ్రామం బాటసారిని కొడికొండ చెక్పోస్ట్ వైపు నుండి వస్తున్న టమోటా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.