హిమాయత్ నగర్: హైదరాబాద్ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో వివరాలు అందించాలి: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
జూబ్లీహిల్స్ సూపర్ ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం మధ్యాహ్నం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్కు సవాలు విసిరారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో వివరాలు అందించాలని ప్రతి పైసలు అక్క చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో దీపక్ రెడ్డిని గెలిపిస్తే మోడీ వద్దకు వెళ్లి నిధులు తీసుకువచ్చే బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకుంటారని బండి సంజయ్ అన్నారు.