కనిగిరి: వెలిగండ్లలో రైతులకు వర్మి కంపోస్ట్, వర్మి వాష్ లపై అవగాహన కల్పించిన మండల వ్యవసాయ శాఖ అధికారి టీ శిల్ప
వెలిగండ్లలో రింగ్ టైప్ వర్మీ కంపోస్ట్, వర్మీ వాష్ లపై వెలిగండ్ల మండల వ్యవసాయ శాఖ అధికారి టి శిల్ప మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వర్మి కంపోస్ట్ వల్ల కలిగే ఉపయోగాలను ఆమె రైతులకు వివరించారు వర్మీ కంపోస్ట్ అంటే వానపాములను ఉపయోగించి ,సేంద్రియ వ్యర్థాలను కంపోస్టుగా మార్చడమేనని వివరించారు . వర్మీ వాష్ అనేది కంపోస్ట్ బెడ్ల నుండి సేకరించిన ద్రవసారమును నీటితో కలిపి మొక్కలు, ఆకులపై పిచికారీ చేసి వాటికి పోషక విలువలు అందించడమేనని రైతులకు వ్యవసాయ శాఖ అధికారి వివరించారు