మెదక్: తెలంగాణ విమోచన దినం సందర్భంగా పటేల్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఎగరవేసిన బిజెపి నాయకులు
Medak, Medak | Sep 17, 2025 తెలంగాణ విమోచన దినం సందర్భంగా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు పోగుల రాజా ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్తూపం వద్ద పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది, అనంతరం మోడీ పుట్టినరోజు సందర్భంగా రుద్రారం గ్రామంలో గల సంగమేశ్వర ఆలయంలో మోడీ పేరు పైన ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, రుద్రారం ప్రైమరీ స్కూల్ విద్యార్ధులకు చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ఉదయం మాట్లాడుతూ విమోచన దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఎగరవేయడం జరిగిందన్నారు.