కొండపి: టంగుటూరు లో మరో వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తికి 14 రోజుల కోట్లు రిమాండ్ విధించిందని ఎస్సై నాగమల్లేశ్వరరావు
ప్రకాశం జిల్లా టంగుటూరు లోని అంబేద్కర్ నగర్లో ఈ నెల మూడో తేదీన మద్యం సేవించి మరో వ్యక్తిపై దాడి చేసిన రమేష్ అనే వ్యక్తికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని ఎస్సై నాగమల్లేశ్వరరావు బుధవారం వెల్లడించారు. మద్యం తాగి నడిరోడ్డులో అల్లరి చేస్తున్న నేపథ్యంలో రమేష్ అనే వ్యక్తిని మరో వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహం చెందినా రమేష్ ఇటుకరాయితో ప్రశ్నించిన వ్యక్తి తలను పగలగొట్టాడు. కేసు నమోదు చేసి నిందితుడిని సింగరాయకొండలో ప్రవేశపెట్టగా నిందితుడికి 14 రోజులు కోర్టు రిమాండ్ విధించిందని ఎస్ఐ అన్నారు.