కొత్తగూడెం: డిజిటల్ విద్యా విధానంలో విద్యార్థులు సులభంగా నేర్చుకోవచ్చు: జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్
జిల్లా విద్యా శిక్షణా కేంద్రం,కొత్తగూడెం నందు జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని 8 ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకు మరియు 2 భవిత సెంటర్ ల IERP లకు CSR పథకం కింద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారు డిజిటల్ బోధనా పరికరాలను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ CSR లో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు ప్రత్యేకంగా భద్రాద్రి జిల్లాలో 25 లక్షల రూపాయలు విలువ చేసే బోధనా పరికరాలను ఇచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.