క్రమశిక్షణతో కూడిన విద్యతోనే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహించిన తల్లితండ్రులు ఉపాధ్యాయ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో కేరళ రాష్ట్రం విద్యలో ముందుదుందని అందుకే వారు ఇష్టమైన రంగుని ఎంచుకొని అభివృద్ధి చెందుతున్నారన్నారు. మన రాష్ట్రంలో ఇంకా విద్యలో మెరుగుపడవలసి ఉందని విద్యార్థులు కూడా బాగా చదువుకుని మన రాష్ట్ర భవిష్యత్తుకు సృష్టికర్తలు కావాలన్నారు