మంచిర్యాల: 1100 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు
మంచిర్యాల రైల్వే స్టేషన్ లో అక్రమంగా తీసుకొస్తున్న గంజాయిని పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. గోదావరి ఖనికి చెందిన బిజిగిరి విజయ్ అనే వ్యక్తి బల్లార్షలో గంజాయి కొని వస్తుండగా పట్టణ సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐ తిరుపతి అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద 1100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.