విశాఖపట్నం: ఓట్ల చోరీ పై నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం దక్షిణ నియోజకవర్గం జరిగింది
కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఓట్ల అవకతవకల పై AICC ఆదేశానుసారం నగరంలో వార్డు పరిధిలో ఓటర్ల నుండి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బుధవారం నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డాల వర్మ రాజు ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులకు,వార్డు ప్రెసిడెంట్ లకు సంతకాల సేకరణపై దిశ నిర్దేశం చేశారు.దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు నుండి సంతకాల సేకరణ ఉద్యమం డీసీసీ అధ్యక్షులు సారధ్యంలో ప్రారంభించారు.కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, స్పోర్ట్ సెల్ ఛైర్మన్ కమలాకర్, పాల్గున్నారు