కనిగిరి పట్టణంలో టిడిపి ఆధ్వర్యంలో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్థానిక ఒంగోలు బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యే అవకాశం లభించింది అన్నారు.