నారాయణపేట్: పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ లో పాల్గొన్న పేట పిఆర్ఓ
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు సేవలను ప్రజలకు మరింత సమాచార పరంగా బలోపేతం చేయడం లక్ష్యంగా సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ నందు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ల కు మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ సురక్ష వారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పి ఆర్ ఓ ల బాధ్యతలు ప్రజలతో పోలీసుల మధ్య వారధిగా పనిచేసేవి కావున నిజాయితీతో నైపుణ్యంతో వేగవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నారాయణపేట పఆర్ఓ వెంకట్రాములు పాల్గొన్నారు.