హుజూరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 147 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్
హుజూరాబాద్: పట్టణం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత మాజీ రాజ్యసభ సభ్యుడు వోడితెల రాజేశ్వర్ రావు జయంతిని పురస్కరించుకొని సైదాపూర్ క్రాస్ రోడ్డులో ఉన్న రాజేశ్వర్ రావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో 147 మంది లబ్ధిదారులకు 54 లక్షల విలువైన CMRF చెక్కులను అందజేశారు. కేంద్రం పంపిణీ చేసే యూరియా సరిగ్గా పంపక రాష్ట్ర ప్రభుత్వం మీద నింద వేయడం సరి కాదని అన్నారు.