సంతనూతలపాడు: చీమకుర్తిలో బ్యాటరీలు దొంగతనం చేసిన ముద్దాయికి రెండేళ్లు జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధించిన జిల్లా ఎక్సైజ్ కోర్టు
చీమకుర్తి పట్టణంలో బ్యాటరీలు దొంగతనం చేసిన ముద్దాయికి జిల్లా ఎక్సైజ్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష, జరి మన విధించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీమకుర్తి పట్టణంలోని సిద్దా వారి పెట్రోలు బంకు వద్ద సత్యనారాయణ మరియు సుందర రామిరెడ్డిలకు చెందిన లారీలలోని 4 బ్యాటరీలను చీమకుర్తికి చెందిన ముద్దాయి సయ్యద్ బాబు దొంగతనం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి, ముద్దాయి బాబును కోర్టులో హాజరుపరచుగా నేరం రుజువు కావడంతో ముద్దాయికి జిల్లా ఎక్సైజ్ జడ్జి కోమలవల్లి రెండేళ్లు జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధించారు.