ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరూ అదృష్టవంతులని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గుత్తిలోని మోడల్ స్కూల్లో శుక్రవారం ప్లే గ్రౌండ్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం పేటీఎం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నదన్నారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు. విద్యార్థులు బాగా క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.