కందుకూరు MLA ఇంటూరి అవినీతి అంతు చూస్తానని మాజీ MLA బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. కందుకూరులో ఆయన మాట్లాడుతూ.. కందుకూరులో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఇంటూరి అవినీతిని ప్రశ్నిస్తే పోలీసులను ఉసిగొల్పుతూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలతో సహా ఎమ్మెల్యే అవినీతి చిట్టా త్వరలో బయటపెడతానని హెచ్చరించారు.