అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సిండికేట్ నగర్ లో శుక్రవారం ఒంటిగంట పది నిమిషాల సమయంలో మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ సిండికేట్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో విద్యార్థినిలు పాఠశాలలో ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని భవిష్యత్తులో ఈ పాఠశాల అభివృద్ధికి పరిటాల రవీంద్ర ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు విరాళాలను ఇస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.