రాయదుర్గం: 74 ఉడేగోళం వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని డీకొన్న బొలెరో వాహనం, తృటితో తప్పిన ప్రాణాపాయం
రాయదుర్గం పట్టణ శివారులోని 74 ఉడేగోళం వద్ద అనంతపురం హైవే పక్కన ఆగిఉన్న లారీని బొలెరో డీకొన్న ఘటనలో బొలెరో డ్రైవర్ సహా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మారెంపల్లి గ్రామానికి చెందిన బొలెరో వాహనం డ్రైవర్ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంవల్ల ముందు ఉన్న లారీని గమనించక డీకొన్నాడు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో వారికి ప్రాణాపాయం తప్పింది. అయితే బొలెరో ముందుబాగం నుజ్జు నుజ్జయింది.